Saturday, February 19, 2011
మిష్టర్ పెళ్ళాం
ఈపాట పెళ్ళిపుస్తకం లో సరికొత్తచీర పాట కు దీటుగా ఉంటుంది...
వర్ణనలోనే కాదు చిత్రీకరణలోనూ ఎక్కడా బాపు మార్కు మిస్ అవదు.
బాలు గారి గళం ఈ పాటకు మరో అందం
గానం : S.P.బాలసుబ్రఃమణ్యం,
సొగసు చూడతరమా,సొగసు చూడతరమా...
నీ... సొగసు చూడతరమా...
నీ సొగసు చూడతరమా…
నీ ఆపసోపాలు ,నీ తీపి శాపాలు
ఎర్రన్ని కోపాలు ,ఎన్నెన్నో దీపాలు అందమే ...సుమా...
సొగసు చూడతరమా...
నీ సొగసు చూడతరమా...
అరుగు మీద నిలబడీ నీ కురులను దువ్వే వేళ
చేజారిన దువ్వెనకు బేజారుగ వంగినపుడు
చిరుకోపం చీర కట్టి సిగ్గును చెంగున దాచి
పక్కుమన్న చక్కదనం పరుగో పరుగెత్తినపుడు
ఆ సొగసు చూడతరమా...
నీ సొగసు చూడతరమా...
పెట్టీ పెట్టని ముద్దులు ఇట్టే విదిలించికొట్టి
గుమ్మెత్తే సోయగాన గుమ్మాలను దాటు వేళ
చెంగు పట్టి రారమ్మని చెలగాటకు దిగుతుంటే
తడిబారిన కన్నులతో విడువిడువంటునప్పుడు విడువిడువంటునప్పుడు
ఆ సొగసు చూడతరమా...
నీ సొగసు చూడతరమా...
పసిపాపకు పాలిస్తు పరవశించి ఉన్నపుడు
పెదపాపడు పాకి వచ్చి మరి నాకు అన్నపుడు
మొట్టికాయ వేసి చీ పొండి అన్నప్పుడు
నా ఏడుపు నీ నవ్వు హరివిల్లై వెలసినపుడు
ఆ సొగసు చూడతరమా...
నీ సొగసు చూడతరమా...
సిరిమల్లెలు హరి నీలపు జడలో తురిమి
క్షణమే యుగమై వేచి వేచి
చలి పొంగులు తెలికోకల ముడిలో అదిమి
అలసొ సొలసి కన్నులు వాచి
నిట్టూర్పుల నిశిరాత్రిలో నిదరోవు అందాలతో
త్యాగరాజ కృతిలో సీతాకృతి గల ఇటువంటి సొగసు చూడతరమా…
నీ సొగసు చూడతరమా...
నీ సొగసు చూడతరమా...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment