ఇష్టమైన పాట అనే పదం చాలా చిన్నది అనిపిస్తుంది ఇళయరాజా గారి పాటలు వింటుంటే.
గీతాంజలి పేరుతోనే నా బ్లాగు పెట్టదానికి కారణం ఇదే.
గీతాంజలి (1985)
సంగీతం : ఇళయ రాజా
తారాగణం : నాగార్జున గిరిజ
గానం : S.P.బాలసుబ్రమణ్యం
పల్లవి : ఆమనీ పాడవే హయిగా…
మూగవై పోకు ఈ వేళా…
రాలేటి పూల రాగాలతొ… పూసేటి పూల గంధాలతొ
మంచు తాకి కోయిలా… మౌనమైన వేళలా…
ఆమనీ పాడవే హయిగా… - 2
చరణం 1 : వయస్సులో వసంతమే… ఉషస్సులా జ్వలించగా
మనస్సుల్లో నిరాశలే… రచించెలే మరీచికా
పదాల నా ఎదా… స్వరాల సంపదా
తరాల నా కధా… క్షణాలదే కధా…
గతించిపొవు గాధ నేననీ…
ఆమనీ పాడవే హయిగా… మూగవై పోకు ఈ వేళా…
చరణం 2: ఛుకాలతో… పికాలతో… ధ్వనించిన మధూధయం…
వినీధులీ కలా నిజం… స్ర్పుశించినా మహోదయం…
మరొ ప్రపంచమె మరింత చెరువై…నివాళి కోరిన ఉగాది వేళలో…
గతించిపోని గాధ నేననీ…
ఆమనీ పాడవే హయిగా… మూగవై పోకు ఈ వేళా…
రాలేటి పూల రాగాలతొ… పూసేటి పూల గంధాలతొ
మంచు తాకి కోయిలా… మౌనమైన వేళలా…
ఆమనీ పాడవే హయిగా… - 2
1 comment:
padaala naa eda,swaraala sampada..tharaala naa katha kshanaaladekada...wov..entha manchi saahityam..thank u sooo much
Post a Comment