నిజంగానే ఈ వేసవి చాలా చల్లగా ఉండడమే కాకుండా,సంగీత ప్రియుల దాహార్తిని కూడా తీర్చింది
గానం : గాయత్రి
సాహిత్యం : వేటూరి
సంగీతం : K.M.రాధాక్రిష్ణన్
పల్లవి : నీలగగనా..ఘనవిచలనా..ధరణిజా శ్రీరమణా
ఆ..ఆ.. మధురవదనా..నళిననయనా..మనవి వినరా రామా
రామచక్కని సీతకీ అరచేత గోరింటా
ఇంత చక్కని చుక్కకీ ఇంక ఎవరూ మొగుడంట (రామచక్కని సీతకీ)
చరణం : పుడతవీ పునవేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే
ఎడమచేతను శివుని విల్లును ఎత్తినా రాముడే
ఎత్తగలడా సీత జడనూ తాళి కట్టే వేళలో - రామచక్కని సీతకీ
చరణం : ఎర్ర జాబిలి చేయి గిల్లీ రాముడేడని అడుగుతుంటే
చూడలేదని పెదవి చెప్పే..చెప్పలేమని కనులు చెప్పే
నల్లపూసైనాడు దేవుడు నల్లనీ రఘురాముడూ
రామచక్కని సీతకీ..
చరణం : చుక్కనడిగా దిక్కునడిగా..చెమ్మగిల్లిన చూపునడిగా
నీరు పొంగిన కనులలోనా..నీటి తెరలే అడ్డు నిలిచే
చూసుకోమని మనసు తెలిపె..మనసు మాటలు కాదుగా
రామచక్కని సీతకీ అరచేత గోరింటా
ఇంత చక్కని చుక్కకీ ఇంక ఎవరూ మొగుడంట - రామచక్కని సీతకీ..
ఇందువదనా.. కుందరదనా .. మందగమనా..భామా
ఎందువలనా.. ఇందువదనా.. ఇంత మధనా..ప్రేమా
No comments:
Post a Comment