తరలిరాద తనే వసంతం
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం
సంగీతం : ఇళయ రాజా
పల్లవి : తరలిరాద తనే వసంతం
తన దరికి రాని వనాలకోసం - 2
గగనాల దాకా అలసాగకుంటె
మేఘాల రాగం ఇల చేరుకోదా (తరలిరాద తనే వసంతం)
వెన్నెల దీపం కొందరిదా..అడవిని సైతం వెలుగు కదా - 2
ఎల్లలులేనీ చల్లని గాలీ అందరికోసం అందునుకాదా
ప్రతి మదిని లేపే ప్రభాత రాగం
పదే పదే చూపే ప్రధాన మార్గం
ఏవీ సొంతం కోసం కాదను సందేశం పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం
ఇది తెలియని మనుగడ కధ దిశనెరుగై గమనము కద (తరలిరాద తనే వసంతం )
బ్రతుకున లేనీ శృతి కలదా.. ఎదసడిలోనే లయలేదా - 2
ఏ కళకైనా ఏ కలకైనా జీవితరంగం వేదిక కాదా
ప్రజాధనం కానీ కళా విలాసం
ఏ ప్రయోజనం లేని వృధా వికాసం
కూసే కోయిల పోటే కాలం ఆగిందా
మారే ఏరే పారే మరో పదం రాదా
మురళికి గల స్వరమున కళ పెదవిని విడి పలకదు కద
తరలిరాద తనే వసంతంతన దరికి రాని వనాలకోసం
గగనాల దాకా అలసాగకుంటెమేఘాల రాగం ఇల చేరుకోదా (తరలిరాద తనే వసంతం)
No comments:
Post a Comment