Saturday, December 15, 2007

గీతాంజలి

ఓ పాప లాలి ...
గానం:S.P.బాలసుబ్రమణ్యం

పల్లవి : ఓ పాప లాలి జన్మకే లాలి ప్రెమకే లాలి పాడన తీయగా…
ఓ పాప లాలి జన్మకే లాలి ప్రెమకే లాలి పాడన తీయగా…ఓ పాప లాలీ…

చరణం 1 : నా జోలలా లీలగా తాకాలని గాలినే కోరనా జాలిగా…
నీ సవ్వడె సన్నగ ఉండాలనికోరనా గుండెనే కోరికా…
కలలారని పసి పాప తల వాల్చిన వొడిలొ
తడి నీడలు తడనీయకు ఈ దేవత గుడిలో
చిరు చేపల కనుపాపలకిది నా మనవీ

ఓ పాప లాలి జన్మకే లాలి ప్రెమకే లాలి పాడన తీయగా…ఓ పాప లాలీ…
చరణం 2: ఓ మేఘమా ఉరమకే ఈ పూటకి
గాలిలో… తెలిపో… వెళ్ళిపో…
ఓ కోయిల పాడవే నా పాటని…తీయని… తేనెలే… చల్లిపో…
ఇరు సంధ్యలు కదలాడే యెద ఊయల ఒడిలో
సెలయేరుల అల పాటే వినిపించని గదిలో
చలి యెండకు సిరివెన్నలకిది నా మనవీ…

ఓ పాప లాలి జన్మకే లాలి ప్రెమకే లాలి పాడన తీయగా…ఓ పాప లాలి జన్మకే లాలి ప్రెమకే లాలి పాడన తీయగా…ఓ పాప లాలీ…

No comments: