సప్తపది
గానం : జానకి
సంగీతం:కె.వి.మహదేవన్
రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి
నవరస మురళి ఆ నందన మురళిఇదేనా ఇదేనా ఆ మురళి
మొహనమురళిఇదేనా ఆ మురళిరేపల్లియ
కాళింది మడుగున కాళియుని పడగల
ఆబాల గోపాల మాబాల గోపాలుని - 2
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ - 2
తాండవమాడిన సరళి గుండెల మ్రోగిన మురళిఇదేనా.... ఇదేనా ఆ మురళి (రేపల్లియ)
అనగల రాగమై తొలుత వీనులలరించిఅనలేని రాగమై మరల వినిపించి మరులే కురిపించి
జీవన రాగమై బృందావన గీతమయి -2
కన్నుల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళిఇదేనా
ఇదేనా.... ఆ మురళి
వేణుగానలోలుని మురిపించిన రవళి నటనల సరళి ఆ నందనమురళి
ఇదేనా ఆ మురలి మువ్వల మురళి ఇదేనా ఆ మురలి
మధురానగరిలో యమునా లహరిలోఆ రాధ ఆరాధనా గీతి పలికించి - 2
సంగీత నాట్యాల సంగమ సుఖ వేణువై..ఆ
రాసలీలకే ఊపిరిపోసిన అందెల రవళిఇదేనా..ఇదేనా ఆ మురళి
(రేపల్లియ)
No comments:
Post a Comment