Thursday, December 27, 2007

స్వయంవరం

వందేమాతం శ్రీనివాస్ సంగీతంలో వచ్చిన పాటల్లో నాకు ఇది ది బెస్ట్ అనిపించిన పాట...చాల చాలా ఇష్టమైన పాట
మరల తెలుపనా...
గానం : చిత్ర
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్.

మప మప ని రిమ రిమ స ఆ ఆ ఆ...

పల్లవి : మరల తెలుపనా ప్రియా మరల తెలుపనా
ఎదలోయల దాచుకున్న మధురోహల పరిమళాన్ని
కనుపాపలో నింపుకున్నా చిరునవ్వుల పరిచయాన్ని - మరల తెలుపనా

చరణం : విరబూసిన వెన్నెలలో తెర తీసిన బిడియాలని-2
అణువణువు అల్లుకున్న అంతులేని విరహాలని -2
నిదురపోని కన్నులలో పవళించు ఆశలని
చెప్ప లేక చేతకాక మనసుపడే తడబాటుని - మరల తెలుపనా

చరణం : నిన్న లేని భావమేదొ కనులు తెరిచి కలయచూచి - 2
మాటరాని మౌనమేదో పెదవి మీద ఒదిగిపోయి
ఒక క్షణమే ఆవేదన మరు క్షణమే ఆరాధన
తెలిరరాక తెలుపలేక మనసు పడే మధుర బాధ..
మరల తెలుపనా ప్రియా మరల తెలుపనా....

No comments: