Wednesday, December 19, 2007

శ్రీ రామ పాదమా

శ్రీ రామ పాదమా
రాగం: అమృతవాహిని
ఆ: స రి2 మ1 ప ద1 ని2 స
అవ: స ని2 ద1 మ1 గ2

పల్లవి : శ్రీ రామ పాదమా నీ కృప జాలునే
చిత్తమునకు రావే

అను.పల్లవి: వారిజభవ సనక సనందన వాసవ శ్రీనారదాదులెల్ల పూజించే

చరణం: దారిని శిలయై తాపము తాళక ధారగా కన్నీరును రాల్చగ
శూర అహల్యను జూచి బ్రోచిన రీతిధన్యు సేయవే త్యాగరాజ గేయమా

No comments: