శ్రీ త్యాగరాజకీర్తన
వసంత రాగం
రూపక తాళం
పల్లవి :
సీతమ్మ మాయమ్మ! శ్రీ రాముడు మా తండ్రి!
అనుపల్లవి :
వాతాత్మజ, సౌమిత్రి, వైనతేయ, రిపు మర్దన, ధాత, భరతాదులు సోదరులు మాకు! ఓ మనసా! (సీతమ్మ)
చరణం :
పరమేశ, వసిష్ఠ, పరాశర, నారద, శౌనక, శుక, సుర పతి, గౌతమ, లంబోదర, గుహ, సనకాదులు
ధర నిజ భాగవతాగ్రేసరులెవరో, వారెల్లను, వర త్యాగరాజునికి పరమ బాంధవులు. మనసా!! (సీతమ్మ)
No comments:
Post a Comment