Thursday, December 20, 2007

పంతులమ్మ

సిరిమల్లె నీవే విరిజల్లు కావే..

గానం: S.P.బాలసుబ్రమణ్యం.



సిరిమల్లె నీవే విరిజల్లు కావే

వరదల్లె రావే వలపంటె నీవే

ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే (సిరిమల్లె నీవే)



ఎలదేటిపాటా చెలరేగె నాలో

చెలరేగిపోవే మధుమాసమల్లే

ఎలమావి తోటా పలికింది నాలో

పలికించుకోవే మది కోయిలల్లే

నీ పలుకు నాదే నా బ్రతుకు నీదే

తొలిపూత నవ్వే వనదేవతల్లే

పున్నాగపూలే సన్నాయి పాడే

ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే ( సిరిమల్లె నీవే )



మరుమల్లె తోటా మారాకు వేసే

మారాకువేసే నీ రాకతోనే

నీపలుకు పాటై బ్రతుకైనవేళా

బ్రతికించుకోవే నీ పదముగానే

నా పదము నీవే నా బ్రతుకు నీవే

అనురాగమల్లే సుమగీతమల్లే

నన్నల్లుకోవే నాఇల్లు నీవే

ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే (సిరిమల్లె నీవే )

2 comments:

pollution said...

raghu excelent this song ilove this song very very very much

పావనీలత (Pavani Latha) said...

MSN garu..
Thx for visiting my blog.