Thursday, December 27, 2007

మాతృదేవోభవ

వేణువై వచ్చాను...
గానం :చిత్ర
సంగీతం : కీరవాణి
రచన : సి.నా.రె

పల్లవి : వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి
వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి
మమతలన్నీ మౌనగానం వాంఛలన్నీ వాయులీనం
వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి

చరణం : ఏడుకొండలకైనా అండ తానొక్కడే
ఏడు జన్మల తీపి ఈ బంధమే -2
నీ కంటిలో నలక లో వెలుగు నేననక
నేను నేననుకుంటే ఎద చీకటి హరీ హరీ.....హరీ
రాయినై ఉన్నాను ఏనాటికీ రామ పాదము రాక ఏనాటికీ..

వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి

చరణం :నీరు కన్నీరాయే ఊపిరే బరువాయె
నీరు నిప్పుగ మారె నా గుండెలో
ఆ నింగిలో కలిసి నా శూన్యబంధాలు
పుట్టిల్లు చేరెను మట్టి ప్రణాలు హరీ హరీ హరీ
రెప్పనై ఉన్నాను నీ కంటికి పాపనై వస్తాను నీ ఇంటికి...
వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి
వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి

1 comment:

Anonymous said...

ఈ పాట వ్రాసింది వేటూరి గారు