Tuesday, December 18, 2007

స్వాతికిరణం

స్వాతికిరణం
గానం : వాణిజయరాం,
సంగీతం : కె.వి.మహదేవన్

ఆనతినీయరా హరా..
సన్నుతి సేయగా, సమ్మతి నీయరా, దొరా
సన్నిధి జేరగా,ఆనతినీయరా...., హరా
సన్నుతి సేయగా, సమ్మతి నీయరా, దొరా
సన్నిధి జేరగా,ఆనతినీయరా హరా.....

నీ ఆన లేనిదే, రచింపజాలునా
వేదాల వాణితో విరించి విశ్వ నాటకం
నీ సైగ కానిదే, జగాన సాగునా ఆ యోగమాయతో మురారి దివ్యపాలనం
వసుమతిలో ప్రతీ క్షణం పసుపతి నీ అధీనమై, -2
కదులునుగా సదా సదాశివ
ఆనతినీయరా.. హరా...
ని ని స ని ప నీ ప మ గ స గ ఆనతి నీయరా.....
అచలనాధ అర్చింతునురా...ఆనతినీయరా....
పమ పని పమ పని పమ పని గమ పని
సని సగ సని సగ సని సగ పని సగగమగసా నిపమ గమగస సగసని
ఆనతినీయరా...
జంగమ దేవర సేవలు గొనరా...మంగళ దాయక దీవెనలిడర...
సాష్ఠాంగముగ దండము సేతురా.ఆనతినీయరా....
సానిప గమపానిపమగమగ పాప పప మపని పాప పప
గగమ గాస ససనిసగ సాస సససగ గస గప పమ పస నిసగసని
సాగ సాగసని సాగ సాగసగ గాస సాససని సాగ గగసగ గాపద గస గా స ని పమగమ గా
ఆనతినీయరా....
శంకరా...శంకించకురా వంక జాబిలిని జడను ముడుచుకొని,
విసపు నాగులను చంకనెత్తుకొని,నిలకడనెరుగని గంగనేలి,
ఏ వంకలేని నా వంకనొక్కకడగంటి చూపు పడనీయవేమి నీ
కింకరుణిక సేవించుకొందురా..ఆనతినీయరా.....

పప పమప నినిపమగస గగపప పమప నినిపమగస
గగమపని గా మపనిస మా పనిసగ నీ స పా ని మా ప గా మ సా గామ
పప పమప నినిపమగస గగగమపని గా మపనిస మాపనిసగ
నీ స పా ని మా ప గా మ సా గా మ
పప పమప నినిపమగస గగాగమపని గమపని స మపనిసగనిగమపని
గమపని స మపనిసగనిస పని మ ప గ మ సా గా మ
పప పమప నినిపమగస గ గగామాపని గమాపాని స మపానీసగని సపని మ ప గ మ సా గా మ
పప పమప నినిపమగస గ గా గా
గగ మమ పప నిగ తక తకిట తకధి
మమమ పప నినిసమ తక తకిట తకధిమిపపనినిసస గని తక తకిట తకధిమి
సపని మప గమ సగమపప పమప నినిపమగస గ గా

రక్షా.... ధర శిక్షా దీక్షా దక్ష..విరూపాక్ష... నీ క్రుపా-వీక్షణాపేక్షిత
ప్రతీక్షనుపేక్ష సేయక,పరీక్ష సేయక,
రక్ష రక్ష యను ప్రార్ధన వినరా..,ఆనతినీయరా....హరా...
సన్నుతి సేయగా, సమ్మతి నీయరా, దొరా... సన్నిధి జేరగా,ఆనతినీయరా, హరా....

1 comment:

Dhananjaya.karre said...

అమృతం ఎలా ఉంటుందో తెలయదు కానీ ఈ పాట వింటుంటే ఇంతకన్నా తియ్యగా ఇంకేమీ ఉండదేమో అనిపిస్తుందండీ. మీకు నా కృతజ్ఞతలు.