Thursday, December 20, 2007

సిరివెన్నెల

ఈ గాలి ...ఈ నేలా...
గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం
రచన : సిరివెన్నెల
సంగీతం :కె.వి.మహదేవన్
ఈ గాలి ...ఈ నేలా... ఈ వూరు సేలయేరు
పల్లవి : ఈ గాలి ఈ నేలా... ఈ వూరు సేలయేరు....
నన్నుగన్న నా వాళ్ళు ఆ నా కళ్ళ లోగిళ్ళు....-2 (ఈ గాలి)

చరణం : చిన్నారి గోరవంక కూసేను ఆ వంక
నా రాక తెలిశాక వచ్చేను నా వంక - 2
ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్ళకు కలిశాక - 2
ఉప్పోంగిన గుండెలకేక ఎగసేను నింగి దాక - 2
ఎగసేను నింగి దాక.... (ఈ గాలి )

చరణం : యేనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కలను
ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడొ ఈ కళను - 2
ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను - 2
ఈ రాళ్ళే జవరాలై ఇక నాట్యాలాడేను.......

ఈ గాలి ...ఈ నేలా... ఈ వూరు సేలయేరు

1 comment:

శ్రీ ( జనార్ధన శ్రీనివాస రెడ్ది ) said...

చాలా బాగుంది రా బ్లాగ్,ఈ సినిమా లో మిగతా పాటలు కూడా పెట్టు...