Thursday, April 24, 2008

ఆదిత్య 369

సంగీతం: ఇళయరాజా
రచన: వేటూరి సుందరరామమూర్తి
గానం: జిక్కి,S.P.బాలసుబ్రమణ్యం,శైలజ

పల్లవి : నెరజాణనులే వరవీణనులే గిలిగించితాలలో
జాణనులే మృదుపాణినిలే మధుసంతకాలలో
కన్నులలో సరసపు వెన్నెలలే
సన్నలలో గుసగుస తెమ్మెరలే
మోవి గని మొగ్గగ నీ మోజు పడిన వేళలో

చరణం : మోమటు దోచి మురిపెము పెంచే లాహిరిలో
మూగవుగానే మురళిని వూదే వైఖరిలో
చెలి వొంపులలో హంపికలా వూగే వుయ్యాల
చెలి పయ్యదలో తుంగ అలా పొంగే యీ వేళ
మరి అందుకు విరి పానుపు సవరించవేమిరా

చరణం : చీకటి కోపం చెలిమికి లాభం... కౌగిలిలో
వెన్నెల తాపం వయసుకు ప్రాణం యీ చలిలో
చెలి నా రతిలా హారతిలా నవ్వాలీవేళ
తొలి సోయగమే ఓ సగము ఇవ్వాలీవేళ
పరువానికి పగవానికి వొక న్యాయమింక సాగునా

నెరజాణవులే వరవీణవులే గిలిగించితాలలో
జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో

3 comments:

Unknown said...

I am fine chandamama garu.

Even i post the songs which u have in mind, you please go ahead and post them in your blog. Cause its natural to have similar songs in different blogs. alaa anukunte, naa blog lovi mee blog lo..mee blog lo chaala songs naa blog lo unnayi kadaa mari.

:)

Anonymous said...

hi chandamama garu
mi blog peru laga mi patalu kuda chala cool ga pleasent ga unnaee kani ee madya updation chala takkuva gauntnaye
we expect more from u

sri...

పావనీలత (Pavani Latha) said...

@ Venu
Thx for visiting my blog venu garu.
I do agree with you...

@Anonymaous
Thx for ur encouragement.Sure i will find time and update it...