Wednesday, April 23, 2008

అంతం

నీ నవ్వు చెప్పింది నాతో ...
గానం : S.P.బాలసుబ్రమణ్యం
రచన : సీతారామశాస్త్రి

పల్లవి :నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ లోటేమిటో
నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఎమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ లోటేమిటో

చరణం :నాకై చాచిన నీ చేతిలో
చదివాను నా నిన్న నీ
నాకై చాచిన నీ చేతిలో
చదివాను నా నిన్న నీ
నాతో సాగిన నీ అడుగులో చూశాను మన రేపు నీ
పంచేందుకే ఒకరు లేని బతుకెంత బరువో అనీ
ఏ తోడుకీ నోచుకోనినడకెంత అలుపో అనీ

చరణం :నల్లని నీ కను పాపలలో ఉదయాలు కనిపించనీ
నల్లని నీ కను పాపలలో ఉదయాలు కనిపించనీ
వెన్నెల పేరే వినిపించనీ నడి రేయి కరిగించనీ
నా పెదవిలో నువ్విలాగె చిరునవ్వు పుడుతుందనీ
నీ సిగ్గు నా జీవితాన తొలి ముగ్గు పెడుతుందనీ

చరణం : యెనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
యేనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
తనువు మనసు చెరి సగమని పంచాలి అనిపించునో
సరిగా అదే సుభముహూర్తం సంపూర్ణ మయ్యేందుకు
మనమే మరో కొత్త జన్మం పొందేటి బంధాలకు
ఊ లాల లాల...

నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ లోటేమిటో

No comments: