ప్రేమ లేదని ప్రేమించరాదనీ ...
గానం : బాలసుబ్రమణ్యం
సంగీతం : ఇళయరాజా
రచన : ఆత్రేయ
లా ల లాలల… లా లా ల లా లల
పల్లవి : ప్రేమ లేదని ప్రేమించరాదనీ - 2
సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటనీ
ఓ ప్రియా… జొహారులూ…
ప్రేమ లేదని ప్రేమించరాదనీ - 2
సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటనీ
ఓ ప్రియా… జొహారులూ…
లా ల లాలల… లా లా ల లా లల
చరణం : మనసు మాసిపోతే మనిషే కాడని
కటిక రాయికయినా కన్నీరుందని
వలపుచిచ్చు రగులుకుంటే ఆరిపోదని
గడియ పడిన మనసు తలుపు తట్టి చెప్పనీ
ఉసురు తప్పి మూగబోయి నీ ఊపిరీ - 2
మోడువారి నీడ తోడు లేకుంటినీ
ప్రేమ లేదని ప్రేమించరాదనీ - 2
సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటనీ
ఓ ప్రియా… జొహారులూ…
చరణం : గురుతు చేరిపివేసి జీవించాలని
చెరప లేకపోతే మరణించాలని
తెలిసి కూడా చెయలేని వెర్రి వాడిని
గుండె పగిలిపోవు వరకు నన్ను పాడనీ
ముక్కలలో లెక్కలేని రూపాలలో - 2
మరల మరల నిన్ను చూసి రోదించనీ
ప్రేమ లేదని ప్రేమించరాదనీ - 2
సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటనీ
ఓ ప్రియా… జొహారులూ…
లా ల లాలల… లా లా ల లా లల
No comments:
Post a Comment