సంగీతం : M.M.కీరవాణి
ఓం..ఓం
తెలుగు పదానికి జన్మదినం
ఇది జాన పదానికి జ్ఞానపదం
ఏడు స్వరాలే ఏడు కొండలై వెలసిన
కలియుగ విష్ణు పదం
అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం
అరిషడ్వర్గము తెగనరికే హరిఖడ్గమ్మిది నందకము
బ్రహ్మలోకమున బ్రహ్మభారతి నాదాశీస్సులు పొందినదై
శివలోకమ్మున చిద్విలాసమున డమరుధ్వనిలో గమకితమై
దివ్యసభలలో నవ్యలాస్యముల పూబంతుల చేబంతిగ ఎగసి
నీరద మండల నారద తుంబుర మహతి గానవు మహిమలు తెలిసి
సితహిమ కందర యతిరాట్సభలో తపహ ఫలమ్ముగ తళుకుమని
తల్లి తనముకై తల్లడిల్లు ఆ లక్క మాంబ గర్భాలయమ్ములో
ప్రవేశించె ఆనందకము నందనానంద కారకము
అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం
పద్మావతియే పురుడు పోయగ పద్మాసనుడే ఉసురు పోయగ
విష్ణు తేజమై నాద బీజమై అంధ్ర సాహితి అమర కోశమై
అవతరించెను అన్నమయ్య అసతోమా సద్గమయ
అవతరించేను అన్నమయ్య అసతోమా సద్గమయ
పాపడుగా నట్టింట పాకుతూ భాగవతము చేపట్టెనయా
హరినామమ్మును ఆలకించక అరముద్దలనే ముట్టడయా
తెలుగు భారతికి వెలుగు హారతై ఎదలయలో పద కవితలు కలయ
తాళ్ళపాకలో ఎదిగె అన్నమయ్య తమసోమా జ్యోతిర్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
వినరో భాగ్యము విష్ణు కధ
వెనుబలమిదివో విష్ణు కధ
వినరో భాగ్యము విష్ణు కధ
వెనుబలమిదివో విష్ణు కధ
వినరో భాగ్యము విష్ణు కధ
చేరియశోదకు శిశువితడు
ధారుణి బ్రహ్మకు తండ్రియు నితడు
చేరియశోదకు శిశువితడు
ధారుణి బ్రహ్మకు తండ్రియు నితడు
చేరియశోదకు శిశువితడు
అణురేణు పరిపూర్ణమైన రూపము
అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము
అణురేణు పరిపూర్ణమైన రూపము
అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము
అణురేణు పరిపూర్ణమైన రూపము
ఏమని పొగడుదుమే ఇక నిను ఆమని సొబగుల అలమేల్మంగ
ఏమని పొగడుదుమే
వేడుకొందామ వేడుకొందామ వేడుకొందామ వేంకటగిరి వేంకటేశ్వరుని వేడుకొందమా
వేడుకొందామ వేంకటగిరి వేంకటేశ్వరుని వేడుకొందమా
యెలమి కోరిన వరాలిచ్చే దేవుడే
యెలమి కోరిన వరాలిచ్చే దేవుడే వాడు అలమేల్మంగ వాడు
అలమేల్మంగ శ్రీవెంకటాధ్రి నాధుడే
వేడుకొందామ వేడుకొందామ వేంకటగిరి వేంకటేశ్వరుని
వేడుకొందామా వేడుకొందమా వేడుకొందమా వేడుకొందామ..
యేడు కొండల వాడా వేంకటరమణా గోవింద గోవిందా
యేడు కొండల వాడా వేంకటరమణా గోవింద గోవిందా
యేడు కొండల వాడా వేంకటరమణా గోవిందా గోవిందా
ఇందరికి అభయంబు లిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి
ఇందరికి అభయంబు లిచ్చు చేయి
ఇందరికి అభయంబు లిచ్చు చేయి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
కలగంటి కలగంటి
ఇప్పుడిటు కలగంటి
ఏల్లలోకములకు అప్పడగు తిరు వేంకటాద్రీశుగంటి
కలగంటి కలగంటి
అతిశయంబైన శేషాధ్రి శిఖరముగంటి
ప్రతిలేని గోపుర ప్రభలుగంటి
శతకోతి సుర్యతేజములు వెలుగగగంటి
చతురాస్యు పొడగంటి చతురాస్యు పొడగంటి
చయ్యన మేలుకొంటి
కలగంటి కలగంటి
అరుదైన శంఖచక్రాదు లిరుగడగంటి
సరిలేని అభయ హస్తమునుకంటి
తిరు వేంకటాచలఢిపుని చూదగగంటి
హరిగంటి గురుగంటి
హరిగంటి గురుగంటి
అంతట మేలుకంటి
కలగంటి కలగంటి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
పురుషోత్తమా పురుషోత్తమా పురుషోతమా
పొడగంటిమయ్యమిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడయకవయ్య కోనేటి రాయడా
పోడగంటిమయ్యమిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడయకవయ్య కోనేటి రాయడా
పోడగంటిమయ్యమిమ్ము పురుషోత్తమా
కోరిమమ్ము నేలినట్టి కులదైవమా చాలా
నేరిచి పెద్దలిచ్చిన నిదానమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా
మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా
పోడగంటిమయ్యమిమ్ము పురుషోత్తమా
చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా
చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా
రోగాలడచి రక్షించే దివ్యౌషధమా
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా
బదిబాయక తిరిగే ప్రాణబంధుడా
మమ్ము గడియించినట్టి శ్రీవేంకటనాధుడా
పోడగంటిమయ్యమిమ్ము పురుషోత్తమా
No comments:
Post a Comment