Wednesday, April 23, 2008

అనుకోకుండా ఒక రోజు

నీడల్లే తరుముతు ఉంది...

సంగీతం: కీరవాణి
రచన :కీరవాణి, గంగరాజు గుణ్ణం
గానం : శ్రేయా ఘోషల్

పల్లవి : నీడల్లే తరుముతు ఉంది… గతమేదో వెంటాడీ…
మౌనంగ పైబడుతుంది… ఉరుమేదొ ఉండుండీ…
శ్వాసల్లో ఉప్పెనై… చూపుల్లో చీకటై
దిక్కుల్లో శూన్యమై… శూన్యమై…

నీడల్లే తరుముతు ఉంది… గతమేదో వెంటాడీ…

చరణం : నిప్పు పై… నడకలో… తోడుగా… నువ్వుండగ…
ఒక బంధమే… బూడిదై… మంటలే మది నిండగా
నీ బాధ ఏ కొంచెమో… నా చెలిమితో తీరదా….
పీల్చే గాలినైనా… నడిచే నేలనైనా…
నమ్మాలో… నమ్మరాదో… తెలియనీ ఈ పయనంలో

నీడల్లే తరుముతు ఉంది… గతమేదో వెంటాడీ…
మౌనంగ పైబడుతుంది… ఉరుమేదొ ఉండుండీ…


చరణం : ఎందుకో… ఎప్పుడో… ఏమిటొ… ఎక్కడో…
బదులు లేని ప్రశ్నలే… నీ ఉనికినే ఉరి తీయగా…
భయమన్నదే పుట్టదా…ప్రతి ఊహతో పెరగదా…
పీల్చే గాలినైనా… నడిచే నేలనైనా…
నమ్మాలో… నమ్మరాదో… తెలియనీ పయనంలో

నీడల్లే తరుముతు ఉంది… గతమేదో వెంటాడీ…
మౌనంగ పైబడుతుంది… ఉరుమేదొ ఉండుండీ…
శ్వాసల్లో ఉప్పెనై… చూపుల్లో చీకటై
దిక్కుల్లో శూన్యమై… శూన్యమై…

No comments: