అదే నీవు అదే నేను…
గానం : S.P.బాలసుబ్రమణ్యం
సంగీతం : ఇళయరాజా
రచన : ఆత్రేయ
పల్లవి : అదే నీవు అదే నేను… అదే గీతం పాడనా
కధైనా కలైనా కనులలో చూడనా
అదే నీవు అదే నేను… అదే గీతం పాడనా
చరణం : కొండా కోన గుండెల్లో… ఎండా వానలైనాము - 2
గువ్వా గువ్వా కౌగిళ్ళో… గూడౌచేసుకున్నాము
అదే స్నేహమో అదే మోహమో - 2
ఆదీ అంతం ఏదీ లేని గానం
అదే నీవు అదే నేను… అదే గీతం పాడనా
కధైనా కలైనా కనులలో చూడనా
చరణం : నిన్నా రేపు సందెల్లో… నీడై వుండమన్నావు - 2
కన్నీరైన ప్రేమల్లో… పన్నీరౌదామన్నావు
అదే బాసగా… అదే ఆశ గా - 2
ఎన్ని నాళ్ళు ఈ నిన్న పాటె పాడను
అదే నీవు అదె నేను… అదె గీతం పాడనా - 2
కధైనా కలైనా కనులలొ చూడనా
అదే నీవు అదే నేను… అదె గీతం పాడనా
No comments:
Post a Comment