Friday, April 11, 2008

సప్తపది

గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన
గానం : S.P.బాలసుబ్రమణ్యం,S.జానకి
పల్లవి : గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన
గోధూళి ఎర్రన ఎందువలనా

చరణం : తెల్లావు కడుపులో కర్రావులుండవా...
కర్రావు కదుపునా ఎర్రావు పుట్టదా...
గోపయ్య ఆడున్నా గోపెమ్మ ఈడున్నా
గోధూళి కుంకుమై గోపెమ్మకంటదా
ఆ పొద్దు పొడిచేనా...
ఈ పొద్దు గడిచేనా...ఆ..ఆ..
ఎందువలనా అంటే అందువలనా...
అందువలనా అంటే దైవ ఘటనా..

గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన
గోధూళి ఎర్రన ఎందువలనా

చరణం : పిల్లన గోవికి నిలువెల్ల గాయాలు...పాపం...
అల్లన మోవికి తాకితే గేయాలు..ఆ..ఆ..ఆ..
పిల్లన గోవికి నిలువెల్ల గాయాలు
అల్లన మోవికి తాకితే గేయాలు
ఆ మురళి మూగైనా ఆ పెదవి మోడైనా
ఆ గుందె గొంతులో ఈ పాట నిండదా
ఈ తడిని చూసేనా..ఆ.ఆ..
ఆకలిని చూసేనా..ఆ..ఆ
ఎందువలనా అంటే అందువలనా...
అందువలనా అంటే దైవ ఘటనా..

గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన
గోధూళి ఎర్రన ఎందువలనా

No comments: