Friday, April 18, 2008

సైనికుడు

సొగసు చూడ తరమా...
గానం : శ్రేయ ఘోషల్
సంగీతం : హారిస్ జయరాజ్

పల్లవి : సొగసు చూడ తరమా అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా
మనసునాపతరమా రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమా
నా కళ్ళల్లో వాకిళ్ళల్లో ఉయ్యాలలూగే ప్రేమా
సువ్వీ సువ్వి సువ్వాలమ్మా సిందులేసే సూడవమ్మా వయసునాపతరమా
సువ్వీ సువ్వి సువ్వాలమ్మా నాలో నేనూ లేనోయమ్మా ప్రేమ వింత వరమా

చరణం : ఓ చల్ల గాలీ ఆ నింగి దాటి ఈ పిల్లగాలివైపు రావా
ఊహల్లో తేలి నీ ఒళ్ళో వాలి నా ప్రేమ ఊసులాడనీవా
పాల నురుగుల పైన్ పరుగులు తీసి పాలుపంచుకవా
పూల మధురిమ కన్న మధురము కాదా ప్రేమ గాధ వినవా

చరణం : డోలారే డోలా డోలారే డోలా మోగింది చూడు గట్టి మేళా
బుగ్గే కందేలా సిగ్గేపడే లా నాకొచ్చెనమ్మా పెళ్ళికళా
మబ్బు పరుపుల మాటు మెరుపుల మేనా పంపెనమ్మ వాన
నన్ను వలచిన వాడు వరుడై రాగ ఆదమరిచిపోనా

No comments: