ఈ పాట తో "గీతాంజలి" 50 పాటలు పూర్తి చేసుకుంది
ఏ తీగ పూవునో
గానం : పి.సుశీల, కమల్ హసన్
రచన : ఆత్రేయ
సంగీతం : విశ్వనాథన్
పల్లవి :ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమౌనో
అప్పడియన్న ?
హ హ హ అర్ధం కాలేదా ?
ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అబిమానమౌనో
చరణం : మనసు మూగది మాటలు రానిది
మమత ఒకటే అది నేర్చినది
ఆహా...అప్పడియా...
ఆ...పేద్ద అర్ధం అయినట్టు...
భాష లేనిది బంధమున్నది
మన ఇద్దరినీ జత కూర్చినది
మన ఇద్దరినీ జత కూర్చినది
ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అబిమానమౌనో
చరణం : వయసే వయసును పలకరించినది
వలదన్నా అది నిలువకున్నది
హే... నీ రొంబ అళహా ఇరికే
హా..రొంబా? అంటే ?
ఎల్లలు ఏవీ వొల్లనన్నది
నీదీనాదోక లొకమన్నది
నీదీనాదోక లొకమన్నది
ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అబిమానమౌనో
చరణం :తొలిచూపే నను నిలవేసినది
మారుమాపై అది కలవరించినది
నల్ల పొన్ను...అంటే నల్ల పిల్లా...
మొదటి కలయికే ముడివేసినది
తుదిదాకా ఇది నిలకడైనదీ
తుదిదాకా ఇది నిలకడైనది
ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అబిమానమౌనో
No comments:
Post a Comment