Wednesday, April 23, 2008

స్వాతికిరణం

జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా ...

K.విశ్వనాథ్ మరో అధ్భుత కళాఖండం.
K.V.మహదేవన్ గారి ఆఖరి సినిమా ఇది...
అనారోగ్యం కారణంగా అన్ని పాటలకు ఆయన సహాయకుడైన వుహళేంది గారు సంగీతం సమకూర్చారని,
S.P.బాలసుబ్రమణ్యం ఒక T.V.ప్రోగ్రాం లో చెప్పగా విన్నాను.
ఈ పాట వింటుంటే తెలియకుండానే కనులు తడౌతాయి.

గానం : చిత్ర,వాణీ జయరాం

జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా
జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా
రెప్ప వెయ్యనే లేదు ఎందుచేత ఎందుచేత
పదహారు కళలని పదిలంగా వుంచనీ
పదహారు కళలని పదిలంగా వుంచనీ
ఆ కృష్ణ పక్షమే ఎదలో చిచ్చు పెట్టుట చేత

కాటుక కంటినీరు పెదవుల నంటనీకు
చిరు నవ్వు దీపకళిక చిన్నబో నీయకు
నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా
నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా
నీ కుంకుమకెపుడూ పొద్దుగుంకదమ్మా
సున్ని పిండిని నలిచి చిన్నారిగా మలిచి
సంతసాన మునిగింది సంతులేని పార్వతి
సుతుడన్న మతిమరచి శూలాన మెడవిరిచి
పెద్దరికం చూపె చిచ్చుకంటి పెనిమిటి
ప్రాణపతి నంటూందా బిడ్డగతి కంటుందా
ప్రాణపతి నంటూందా బిడ్డగతి కంటుందా
ఆ రెండు కళ్ళల్లో అది కన్నీటి చితి
కాలకూటంకన్న ఘాటైన గరళమిది
గొంతునులిమే గురుతై వెంటనే వుంటుంది
ఆటు పోటు ఘటనలివి ఆట విడుపు నటనలివి
ఆదిశక్తివి నీవు అంటవు నిన్నేవి
నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా
కంచి కెళ్ళిపొయేవే కధలన్ని

No comments: