Wednesday, April 9, 2008

శంకరాభరణం

దొరకునా ఇటువంటి సేవ...

రచన : మైసూరు వేదవాచారి
సంగీతం : K.V.మహదేవన్
గానం :S.P. బాలసుబ్రమణ్యం,వాణీ జయరాం

పల్లవి : దొరకునా ఇటువంటి సేవ
దొరకునా ఇటువంటి సేవ

నీపద రాజీవముల చేరు
నిర్వాణ సోపానమదిరోహణం సేయు త్రోవ...

చరణం : రాగాలనంతాలు నీవేయి రూపాలు
భవరోగ తిమిరాలు ఓకార్చు దీపాలు
నాదాత్మకుడవై...... నాలోనచెలగి....
నాదాత్మకుడవై...... నాలోనచెలగి....
నా ప్రాణ దీపమై ..నాలోన వెలిగి
నినుకొల్చు వేళా దేవాధి దేవా... దేవాధి దేవా..ఆ.ఆ.ఆ.ఆ

దొరకునా ఇటువంటి సేవ
దొరకునా ఇటువంటి సేవ

నీపద రాజీవముల చేరు
నిర్వాణ సోపానమదిరోహణం సేయు త్రోవ...

చరణం : ఉచ్చ్వాస నిచ్చ్వాసములు వాయులీనాలు
స్పందించు నవ నాడులే వీణా గానాలు
నడలు ఎదలోని సడులే మృదంగాలు
నాలోని జీవమై నాకున్న దైవమై వెలుగొందు వేళా
మహనుభావా..... మహనుభావా....

దొరకునా ఇటువంటి సేవ
దొరకునా ఇటువంటి సేవ

నీపద రాజీవముల చేరు
నిర్వాణ సోపానమదిరోహణం సేయు త్రోవ...

No comments: