మౌనమేల నోయీ...
గానం: S.P.బాలసుబ్రమణ్యం, S.జానకి
సంగీతం: ఇళయరాజా
రచన : వేటూరి
పల్లవి : మౌనమేల నోయీ ఈ మరపు రాని రేయి
మౌనమేల నోయి ఈ మరపు రాని రేయి
ఎదలో వెన్నెలా వెలిగే కన్నులా
ఎదలో వెన్నెలా వెలిగే కన్నులా
తారాడే హాయిలో.....హా....
ఇంత మౌనమేల నోయి ఈ మరపు రాని రేయి
చరణం : పలికే పెదవీ వణికింది ఎందుకో
వణికే పెదవీ వెనకాల ఏమిటొ
కలిసే మనసులా,విరిసే వయసులా
కలిసే మనసులా,విరిసే వయసులా
నీలి నీలి ఊసులూ లేత గాలి బాసలూ
ఏమేమో అడిగినా
మౌన మేల నోయి ఈ మరపు రాని రేయి
చరణం : హిమమే కురిసే చందమామ కౌగిటా
సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిటా
ఇవి ఏడడుగులా వలపూ మడుగులా
ఇవి ఏడడుగులా వలపూ మడుగులా
కన్నె ఈడు ఉలుకులూ కంటి పాప కబురులూ
ఎంతెంతో తెలిసినా
మౌన మేల నోయి ఈ మరపు రాని రేయి
ఇంత మౌనమేల నోయి ఈ మరపు రాని రేయి
ఎదలో వెన్నెలా వెలిగే కన్నులా
ఎదలో వెన్నెలా వెలిగే కన్నులా
తారాడే హాయిలో
ఇంత మౌనమేల నోయి ఈ మరపు రాని రేయి
No comments:
Post a Comment