చాలా ఇష్టమైన పాట.పిక్చరైజేషన్ కూడా చాలా నాచురల్ గా ఉంటుంది.
ఈపాటకు ఉష కు మొదటి సారి నంది అవార్డు వచ్చిందనుకుంటా...
చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
గానం : ఉష
సంగీతం : R.P.పట్నాయక్
రచన : సిరివెన్నెల
పల్లవి : చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఆ ...
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
మువ్వలే మనసు పడు పాదమా
ఊహలే ఉలికి పడు ప్రాయమా
హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా
ఆమని మధువనమా...ఆ..ఆ..
చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఆ ...
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
చరణం : పసిడి వేకువలు పండు వెన్నెలలు
పసితనాలు పరువాల వెల్లువలు
కలిపి నిన్ను మలిచాడో బ్రహ్మ...
స్వచ్చమైన వరిచేల సంపదలు
అచ్చతెనుగు మురిపాల సంగతులు
కళ్ళముందు నిలిపావె ముద్దుగుమ్మా
పాలకడలి కెరటాలవంటి నీ లేత అడుగు
తన ఎదను మీటి నేలమ్మ పొంగెనమ్మా...ఆ..ఆ..ఆ
ఆగని సంబరమా...ఆ..ఆ..ఆ..
చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఆ ...
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
చరణం : వరములన్ని నిను వెంటబెట్టుకుని
ఎవరి ఇంట దీపాలు పెట్టమని అడుగుతున్నవే కుందనాల బొమ్మా...
సిరుల రాణి నీ చేయి పట్టి శ్రీహరిగ మారునని రాసిపెట్టి
ఏ వరుని జాతకం వేచి ఉన్నదమ్మా....
అన్నమయ్య శృంగారకీర్తనం వర్ణనలకు ఆకారమైన
బంగారు చిలకవమ్మా....
ఆ..ఆ..ఆ..ఆ కముని సుమ శరమా...ఆ.ఆ
చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఆ ...
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా....
No comments:
Post a Comment