బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా Touching గా ఉంటుంది..పిక్చరైజేషన్ కూడ చాలా రియల్ గా ఉంటుంది...
I love this song...
గానం : శ్రేయా ఘోషల్
సంగీతం : యువన్ శంకర్ రాజా
పల్లవి :తలచి తలచి చూశా
తరలి దరికి వస్తా
నీకై నేను బ్రతికే ఉంటిని
ఓ... నీలో నన్ను చూసుకొంటిని
తెరిచి చూసి చదువువేళ
కాలి పోయే లేఖ రాశా
నీకై నేను బ్రతికే ఉంటిని
ఓ... నీలో నన్ను చూసుకుంటిని
చరణం : కొలువు తీరు తరువుల నీడ
చెప్పుకొనును మనకథనిపుడు
రాలిపొయిన పూల గంధమా ఆ...
రాక తెలుపు మువ్వల సడిని
తలచుకొనును దారులు ఎపుడు
పగిలిపొయిన గాజులు అందమా ఆ..
అరచేత వేడిని రేపే చెలియ చేయి నీ చేత
వొడిన వాలి కధలను చెప్ప రాసిపెట్టలేదూ
తొలి స్వప్నం చాలులే ప్రియతమా
కనులు తెరువుమా...
చరణం : మధురమైన మాటలు ఎన్నో
కలిసిపోవు నీ పలుకులలో
జగము కరుగు రూపే తరుగునా ఆ..
చెరిగి పోని చూపులు నన్ను
రేయి పగలు నిలుచును నీలో
నీదు చూపు నన్ను మరచునా ఆ..
వెంట వచ్చు నీడబింబం
వచ్చి వచ్చిపోవూ
కళ్ళ ముందు సాక్ష్యాలున్నా
తిరిగి నేను వస్తా
ఒక సారి కాదురా ప్రియతమా
ఎపుడూ పిలచినా...
No comments:
Post a Comment